ఎగువ నుంచి గోదావరి పోటెత్తుతుండడంతో పోలవరం ప్రాజెక్టు వద్ద ఏపీ ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. 24గంటలూ ప్రాజెక్టు వద్ద పరిస్థితిని అధికారులు సమీక్షిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. పోలవరం వద్దకు గురువారం రాత్రి వరకు 16,48,375 క్యూసెక్కులు చేరుతుండగా వచ్చింది వచ్చినట్లుగా దిగువకు వదులుతున్నారు. ఇక్కడకు శుక్రవారం సాయంత్రానికి 28.50లక్షల క్యూసెక్కుల వరద చేరొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.