ఇంగువతో అనేక ఆరోగ్య సమస్యలు తొలగుతాయి. ఇంగువను ఆహారాల్లో తీసుకోవడం వల్ల గ్యాస్, పేగుల్లో పురుగులు, ఇర్రిటబుల్ బౌల్ సిండ్రోమ్, అజీర్ణం, కడుపునొప్పి, కడుపు ఉబ్బరం వంటివి తొలగుతాయి. ఇంకా మలబద్దకం, డయేరియా, అల్సర్లు వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందొచ్చు. శ్వాసకోశ సమస్యలుండేవారు ఇంగువను తీసుకోవడం ఉత్తమం. శరీర రోగ నిరోధక శక్తి పెరుగుదలకు ఇంగువను వాడితే మంచి ఫలితం ఉంటుంది.