ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మున్సిపల్ ఉద్యోగులు సమ్మె విరమించాలని కోరుతున్నాం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 15, 2022, 12:32 PM

మున్సిపల్‌ కార్మికుల డిమాండ్‌ల విషయంలో సీఎం వైయ‌స్‌ జగన్‌ సానుకూలంగా స్పందించారని.. ఏపీ మున్సిపల్‌ శాఖ మంత్రి అదిమూలపు సురేష్ తెలిపారు. మున్సిపల్‌ వర్కర్స్‌ సమ్యలపై కేబినెట్‌ సబ్‌ కమిటీ సమావేశం అయ్యాం. సమస్యలపై చర్చించాం. ఓహెచ్‌వో ఇచ్చేందుకు 6 వేలు అలానే ఉంచాలనే డిమాండ్‌కు సీఎం జగన్‌ సానుకూలంగా స్పందించారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు 6వేల రూపాయలు యథాతధంగా ఉంటుంది. జీతంతో పాటు, 6 వేలు OHA కలిపి రూ. 21 వేలు వారికి అందించాలని నిర్ణయం తీసుకున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఈ ఆక్యుపేషనల్ అలవెన్స్ కొనసాగిస్తాం. మున్సిపల్ ఉద్యోగులు సమ్మె విరమించాలని కోరుతున్నాం అని మంత్రి ఆదిమూలపు వెల్లడించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com