ప్రియురాలి కోసం యువకులు కొట్టుకోవడం చాలాసార్లు చూశాం. అయితే ఉత్తరాఖండ్ హల్ద్వానీలో ప్రియుడి కోసం ఇద్దరు అమ్మాయిలు తమ స్నేహితురాళ్లతో కలిసి బాహాబాహీకి దిగారు. జుట్లు పట్టుకుని, బూతులు తిట్టుకుంటూ, కర్రలతో ఘోరంగా కొట్టుకుంటూ నడిరోడ్డుపై హంగామా సృష్టించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి రావడంతో పారిపోయారు. ఈ వీడియో సోషల్ మీడియా లో వైరలవుతోంది.