తెల్లవారు జామున ఊహించని ఓ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..హైదరాబాద్ కులుసుం పుర పోలీస్ స్టేషన్ పరిధిలో భార్యను భర్త హతమార్చాడు.. కులుసుం పుర పోలీస్ స్టేషన్ పరిధిలో సంజయ్ నగర్ జియాగూడలో నివాసముండే మృతురాలు సరిత యాదవ్ (26) ఆమె భర్త సంతోష్ ఓ టిఫిన్ సెంటర్ లో పనిచేస్తుండేవాడు.. సంతోష్ తన భార్య పై అనుమానంతో తన ఇంట్లో సరిత ను ప్రైవేట్ పార్ట్ లో కత్తి తో పొడిచి హత్యకు పాల్పడ్డాడు. అడ్డువచ్చిన మృతురాలు బంధువు పై కూడా కత్తి తో దాడికి పాల్పడ్డాడు. గాయపడ్డ వ్యక్తిని ఉస్మానియా ఆసుపత్రి కీ తరలించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీమ్. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు.. ఈ ఘాతుకానికి పాల్పడ్డ నిందితుడు సంతోష్ ని అదుపులోకి తీసుకున్నారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు హత్యా కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్న కులుసుం పుర పోలీసులు. ఈ అనుమానమే ఈ హత్యకు కారణమా? ఇంకా వేరే ఏదయినాన అనే వివరాలు తెలియాల్సి ఉంది.