ఉత్తరాదిలో ఏటా జరిగే కన్వర్ యాత్రకు ఈసారి మీరట్ వినూత్నంగా సిద్ధమవుతుంది. కన్వర్యాత్ర కోసం ఈసారి బుల్డోజర్ ఆకారంలో వాహనం తయారుచేస్తున్నారు. హిందూ, ముస్లిం కుటుంబాలు తయారీలో పాలుపంచుకుంటుండటం విశేషం. బీజేపీ విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా సదర్ ప్రాంతానికి చెందిన హిందూ, ముస్లిం కుటుంబాలు పదేండ్లుగా కలిసి కన్వర్లు తయారుచేస్తున్నారు. ఈ యాత్ర ఏటా శ్రావణమాసంలో 15 రోజులు కొనసాగుతుంది.