రవాణా రంగంలో స్వయం ఉపాధిని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ‘వైయస్సార్ వాహన మిత్ర’ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం వరుసగా నాలుగో ఏడాది కూడా అందించనుంది. వైయస్ఆర్ వాహన మిత్ర.. డ్రైవర్ అన్నదమ్ములకు బాసటగా 2,61,516 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున రూ.261.51 కోట్ల ఆర్థిక సాయం. నేడు విశాఖపట్నంలో బటన్ నొక్కి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేయనున్న సీఎం వైయస్ జగన్. తమ బతుకు బండి లాగడానికి ఇబ్బంది పడుతున్న డ్రైవర్ అన్నదమ్ములకు జగనన్న ప్రభుత్వం బాసటగా నిలుస్తోంది.. వైయస్ఆర్ వాహనమిత్ర కింద నేడు అందిస్తున్న రూ.261.51 కోట్లతో కలిపి ఇప్పటివరకు మన జగనన్న ప్రభుత్వం మొత్తం రూ. 1,026 కోట్లు సాయంగా అందించింది.