ఢిల్లీ మెట్రోలో జరిగిన ఓ ఫన్నీ సంఘటన ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. టీ షర్ట్ ధరపై మొదలైన వాగ్వాదం ఇద్దరి యువతీ యువకుల మధ్య భౌతికదాడికి దారితీసింది.
ఆమె చెప్పిన టీ షర్టు ధరను యువకుడు ఖండించటంతో యువతి ఒక్కసారిగా అతడి చెంప చెల్లుమనిపించింది. అలాగే వరుసగా కొడుతుండడంతో యువకుడు కూడా ప్రతిఘటించాడు. ఈ ఆకస్మీక చర్యతో అవాక్కైన ప్రయాణికులు, వారు దిగిపోగానే నవ్వుకోవడం వినిపించింది.