ఎయిరిండియా ఫ్లైట్ బాంబు దాడిలో నిర్దోషిగా విడుదలైన రిపుదమన్ సింగ్ మాలిక్ శుక్రవారం దారుణ హత్యకు గురయ్యారు. కెనడాలోని సర్రే ప్రాంతంలో ఆయనను దుండగులు కాల్చి చంపారు. ఈ విషయాన్ని రిపుదమన్ సింగ్ కొడుకు జస్ప్రీత్ మాలిక్ ధ్రువీకరించారు. 1985లో మాంట్రియల్ నుంచి బయలుదేరిన ఎయిరిండియా విమానాన్ని పేల్చివేయగా 331 మంది చనిపోయారు. ఈ కేసులో 4 ఏళ్లు జైలు శిక్ష అనుభవించిన మాలిక్‌ను 2005లో నిర్దోషిగా విడుదలయ్యాడు.