అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదటి భార్య ఇవానా ట్రంప్(73) కన్నుమూశారు. ఈ విషయాన్ని డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. డొనాల్డ్ ట్రంప్, ఇవానా ట్రంప్ లకు 1977 లో వివాహం జరిగింది. వీరు 1990లో విడాకులు తీసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలున్నారు. డొనాల్డ్ ట్రంప్ 1993లో నటి మార్లాను పెళ్లి చేసుకోగా 1999లో విడిపోయారు. ఆ తర్వాత ట్రంప్ 2005లో మెలానియాను పెళ్లాడారు.