పాకిస్తాన్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. పిల్లల కంటి ముందే భార్యను చంపి వంట పాత్రలో ఉడకబెట్టాడో భర్త. సింథ్ ప్రావిన్స్‌లో ఆషిక్ అనే వ్యక్తి ఓ స్కూల్ వాచ్మెన్. భార్య నర్గీస్తోపాటు ఆరుగురు పిల్లలు ఉన్నారు. అయితే ఆషిక్ తన భార్యను అక్రమ సంబంధాలు పెట్టుకోమని బలవంతం చేసేవాడని, అందుకు ఆమె నిరాకరించడంతో పిల్లల ముందే భార్య గొంతు కోసి స్కూల్లోని వంటగదిలో పెద్ద పాత్రలో బాయిల్ చేశాడని పోలీసులు తెలిపారు.