మనది పేదల ప్రభుత్వం..పేదలకు అండగా ఉండే మీ జగనన్న ప్రభుత్వమని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉద్ఘాటించారు. నేను చూశాను..నేను విన్నాను..నేను ఉన్నాను అని చెప్పిన మాటకు కట్టుబడి వైయస్‌ఆర్ వాహన మిత్ర పథకం ప్రారంభించానని చెప్పారు. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లో వాహన మిత్ర పథకం కింద ఒక్కో డ్రైవర్‌కు రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం చేసినట్లు చెప్పారు. కరోనా సమయంలోనూ వాహన మిత్ర పథకం అమలు చేసినట్లు గుర్తు చేశారు. మూడేళ్లలో రూ.1.65 లక్షల కోట్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశామని సీఎం వైయస్ జగన్ అన్నారు. ఎక్కడా కూడా లంచాలు లేవు, వివక్ష లేదన్నారు. కులం చూడలేదు, పార్టీ చూడలేదు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. అప్పటి ప్రభుత్వం, ఇప్పటి ప్రభుత్వానికి ఉన్న తేడా గమనించాలని సీఎం కోరారు. విశాఖలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైయస్ఆర్ వాహన మిత్ర పథకం ద్వారా నాలుగోవిడతగా ఒక్కో లబ్ధిదారునికి రూ.10వేల చొప్పున మొత్తం రూ.261.51 కోట్లను సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి బటన్‌నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమచేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రసంగించారు.