తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. అన్ని కంపార్ట్ మెంట్లు పూర్తిగా నిండి భక్తులు బయట క్యూలైన్స్ లో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతుందని టీటీడీ వర్గాలు వెల్లడించాయి. గురువారం శ్రీవారిని 74,304 మంది భక్తులు దర్శించుకోగా 31,880 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 5.45 కోట్లు వచ్చిందని తెలిపారు.