కర్ణాటకలో ఐటీ ఉద్యోగి అనిత(25) తాను పనిచేస్తున్న కంపెనీలో ట్యాక్సీ డ్రైవర్ అయిన ప్రదీప్ ను ప్రేమ వివాహం చేసుకుంది. అయితే ఆరునెలలకే ప్రదీప్ తన నిజస్వరూపం చూపించాడు. కట్నం కావాలని వేధించాడు. దీంతో అతనితో జీవితం కొనసాగించడం ఇష్టంలేక విడాకుల కోసం కోర్టులో కేసు వేసింది. గురువారం కోర్టు తీర్పు ఇవ్వనుండగా, జీవితంలో తప్పటడుగులు వేశానని విరక్తి చెంది బుధవారం రాత్రి అనిత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.