వినియోగదారులకు ఎస్‌బీఐ భారీ షాకిచ్చింది. పెంచిన మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్(ఎంసీఎల్‌ఆర్ )వడ్డీరేట్లు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో హోం, పర్సనల్, కార్ లోన్‌పై చెల్లించే ఈఎంఐ పెరగనుంది. టెన్యూర్‌ను బట్టి పెరిగిన వడ్డీరేట్లు ఇలా పెరిగాయి.
3 నెలలు - 7.05% నుంచి 7.15%
6 నెలలు - 7.35% నుంచి 7.45%
ఏడాది - 7.40% నుంచి 7.50%
2 ఏళ్ళు - 7.60% నుంచి 7.70%
3 ఏళ్ళు - 7.70% నుంచి 7.80%