గంపలగూడెం మండలం పెనుగొలను బోటిమీద ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయము లో ఆషాడ శుక్రవారం సందర్భంగా శాకాంబరీ అలంకరణ నిర్వహించారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి మూలవిరాటుకు, శ్రీ రాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేత నరసింహ స్వామి ఉత్సవ విగ్రహాలకు వివిధ కాయ కూరలు, ఆకుకూరలు, వేప మండలతో దండల కట్టి చూడముచ్చటగా అలంకరణ చేశారు.
ఆలయ అర్చకులు వడ్డెరపు వెంకటేశ్వర స్వామి దద్దోజనం, పరవాన్నం స్వామివారికి నివేదన చేసి భక్తులకు పంపిణీ చేశారు. శాకంబరీ అలంకరణలో దర్శనమిచ్చిన అమ్మవార్లను భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించారు.