ఆటో నగర్ లో కల టీడీపీ జిల్లాపార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గన్నే వెంకట నారాయణ ప్రసాద్ మాట్లాడుతూ గత నెల రివ్యూలో అధికారులతో జూలై 15 కల్లా రాష్ట్రంలోని రోడ్లపై గుంతలు కనిపించకూడదని 20 నుండి ఫోటో ఎగ్జిబిషన్ అని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చిన జగన్ రెడ్డి జూలై 15 కల్లా గుంతల నుండి కుంటలు స్థాయికి, ఆపై చెరువుల స్థాయికి మారిపోయారని విమర్శించారు. పత్రికలు రాష్ట్రంలోని రోడ్ల దుస్థితి ప్రచురిస్తే గాని తెలుసుకోలేని చేతగాని పరిస్థితుల్లో జగన్ రెడ్డి ప్రభుత్వం ఉందన్నారు. రోడ్లు వేయడానికి ప్రభుత్వం టెండర్లు పిలిచినా ఒక కాంట్రాక్టర్ కూడా ముందుకు రావడం లేదని ఆయన ఆరోపించారు.