మహిళలపై జరుగుతున్న హత్యలు, అత్యాచారాలకు నిరసనగా సేఫ్ స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో 2కే వాక్ నిర్వహించారు. ఈ వాక్ ను డీసీపీ విశాల్ గున్ని ప్రారంభించారు. 2కే వాక్‌లో న్యాయవాదులు, మహిళా సంఘాలు, అన్ని పార్టీల నుంచి మహిళ ప్రతినిధులు పాల్గొన్నారు. టు కే వాక్కులో మహిళా విద్యార్థుల బ్యాండ్ ఆకర్షణగా నిలిచారు.
సేవ్ ఉమెన్ అంటూ నినాదాలతో టూకే వాక్ నిర్వహించారు. ఈ సందర్భంగా విశాల్ గున్ని మాట్లాడుతూ మహిళల భద్రతకు ఎన్టీఆర్ జిల్లా పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని డీసీపీ విశాల్ గున్ని తెలిపారు. మహిళలను గౌరవించడం, లింగ సమానత్వం అనేది ఇంటి నుండే ప్రారంభం కావాలన్నారు. మహిళల పట్ల వివక్ష తగదని సూచించారు. మహిళలు ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్న వారికి విజయవాడ పోలీసులు రక్షణగా ఉంటారని పేర్కొన్నారు