అస్సాంలోని కరీంగంజ్ జిల్లా రతాబరీలో దారుణం చోటుచేసుకుంది. భైరబ్నగర్ ప్రాంతానికి చెందిన సుమ్నా బేగం అనే వివాహితను భర్త షకీల్ అహ్మద్, అత్తమామలు బలవంతంగా యాసిడ్ తాగించడంతో మృతిచెందింది. మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, మృతురాలి భర్తను అరెస్ట్ చేశారు. కొన్ని రోజులుగా మృతిరాలిని భర్త, అత్తమామలు వేధింపులకు గురిచేస్తున్నారని జిల్లా ఎస్పీ పద్మనాభ్ బారుహ్ వెల్లడించారు.