ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్ తన ఉదారతను మరోసారి చాటుకున్నారు. సామాజిక సేవా కార్యక్రమాల కోసం తాజాగా 20 బిలియన్ డాలర్లు విరాళం ప్రకటించారు. అంతేకాదు, తన జీవనానికి, తన కుటుంబ సభ్యుల జీవనానికి కావాల్సింది పోను, మిగిలిన తన యావత్ సంపదను కూడా సమాజానికే ఇచ్చేస్తానని ప్రకటించారు. ‘బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్’ తరఫున ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో ఆయన సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.