జాతీయ స్థాయిలో ఉన్నత విద్యా సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది కూడా ర్యాంకులను ప్రకటించింది. ఓవరాల్ కేటగిరీలో మద్రాస్ ఐఐటీ మొదటి స్థానంలో నిలవగా, బెంగళూరు ఐఐఏస్సీ రెండో స్థానంలో బాబే ఐఐటీ మూడో స్థానంలో నిలిచాయి.యూనివర్సిటీల కేటగిరిలో బెంగళూరు ఐఐఏస్సీ మొదటి స్థానం, ఢిల్లీ జెఎన్‌యూ రెండో స్థానంలో, జామియా మిలియా, ఇస్లామియా మూడో స్థానంలో నిలిచాయి. ఇక ఇంజనీరింగ్ కేటగిరిలో మద్రాస్ ఐఐటీ మొదటి స్థానంలో, ఢిల్లీ ఐఐటీ రెండో స్థానంలో, బాంబే ఐఐటీ మూడో స్థానంలో నిలిచాయి.
మేనేజ్‌మెంట్ విభాగంలో అహ్మదాబాద్ ఐఐఎం మొదటి స్థానంలో నిలవగా, బెంగళూరు ఐఐఎం రెండో స్థానంలో, కోల్‌కతా ఐఐఎం మూడో స్థానంలో నిలిచాయి. ఫార్మసీ విభాగంలో మొదటి స్థానంలో ఢిల్లీ జామియా, రెండో స్థానంలో హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్, మూడో స్థానంలో చండీఘడ్‌లోని పంజాబ్ యూనివర్శిటీ నిలిచింది. ఇవే కాకుండా కాలేజీ, ఆర్కిటెక్చర్, లా, మెడికల్, రీసెర్చ్ కేటగిరీల్లోనూ టాప్ ట్రీ ఇన్‌స్టిట్యూట్‌లను కేంద్ర విద్యాశాఖ ప్రకటించింది.