కృష్ణా జిల్లా గుడివాడలో వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. గుడివాడలో రోడ్లకు మరమ్మత్తులు చేయాలంటూ శుక్రవారం కొడాలి నాని ఇంటి వద్ద జనసేన కార్యకర్తలు నిరసన నిర్వహించారు. జనసేన నేతలను పోలీసులు అడ్డుకోవడంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. జనసేన నాయకులను అరెస్టు చేసేందుకు యత్నించగా తామేం నేరం చేశామంటూ కార్యకర్తలు ఎదురు తిరిగారు. దీంతో భారీగా పోలీసులు మోహరించారు.