బీహార్లోని కటిహార్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. 45 ఏళ్ల మహిళ భర్త వేరే రాష్ట్రంలో పనిచేస్తుండటంతో 11 ఏళ్ల కూతురితో కలిసి స్థానికంగా నివసిస్తుంది. బుధవారం రాత్రి వారు ఇంట్లో నిద్రిస్తుండగా పొరిగింటిలో ఉండే మొహమ్మద్ షమీమ్ అనే వ్యక్తి ఇంట్లోకి చొరబడి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. పెనుగులాట జరగటంతో మేకుతో ఆమె కళ్లలో పొడిచాడు. స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు.