బీసీసీఐ రాజ్యాంగ సవరణపై వేసిన పిటిషన్ను విచారించాలన్న భారత క్రికెట్ నియంత్రణ మండలి అభ్యర్థనను సుప్రీంకోర్టు అంగీకరించింది. దీంతో బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ, సెక్రటరీ జై షాల పదవీకాలం పొడిగింపుపై మరో వారంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ పిటిషన్ను వచ్చే వారం విచారణ జరుపుతామని సుప్రీం చీఫ్ జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం పేర్కొంది. వీరి పదవీకాలం 2020 జులైలోనే ముగిసింది.