తాడేపల్లి: నిషేదిత గుట్కాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని తాడేపల్లి పోలీసులు హెచ్చరించారు. జాతీయ రహదారి వద్ద ఉన్న ఓ దుకాణంలో గుట్కాలు విక్రయిస్తున్నారన్న సమాచారం మేరకు పోలీసులు శుక్రవారం దాడి చేసి సుమారు రూ. 15వేల విలువైన నిషేదిత గుట్కాలను స్వాధీనం చేసుకున్నారు.
దుకాణదారున్ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. పోలీసులు మాట్లాడుతూ గుట్కాలు విక్రయిస్తున్న వ్యక్తుల సమాచారం తెలపాలని సూచించారు.