మహారాష్ట్ర నాందేడ్ జిల్లాలో పెళ్లి కోసం ఓ యువకుడు పడరాని పాట్లు పడ్డాడు. థర్మకోల్ షీట్ సాయంతో వరద నీటిలో 7 కిలోమీటర్ల దూరం ఈత కొట్టాడు. హడ్గావ్ మండలం కొర్రి గ్రామం నుంచి పెళ్లి జరిగే ఉమర్‌ఖేడ్ మండలం సంగమ్ చించోలి వరకు ఈ సాహసం చేశాడు. ఎప్పుడు ఈ ఘటన జరిగింతో తెలియలేదు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. పెళ్లి కోసం ప్రాణాలకు తెగించాడంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa