జగ్గయ్యపేట;పల్లెల్లో వరుస గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్న చైన్ స్నాచర్స్ గ్యాంగ్ ని అరెస్ట్ చేసిన చిల్లకల్లు పోలీసులు అరెస్టు చేశారు. 1 గంట వ్యవధిలో గొలుసు దొంగల్ని పట్టుకొని వారివద్దనుండి 7 లక్షల విలువైన ఐదు బంగారపు గొలుసులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
జగ్గయ్యపేట మండలం పోచంపల్లి గ్రామానికి చెందిన ఆరుగురు ఒక గ్యాంగ్ గా ఏర్పడి పల్లెల్లో మహిళల గొలుసులు కాజెయ్యడమే లక్ష్యంగా బైక్ పై వెళ్తూ పాదచారుల మహిళల మెడలోని బంగారపు గొలుసులను లాక్కేళుతున్నదొంగలను చిల్లకల్లు పోలీసులు ఆట కట్టించారు. ఐదు రోజులు, ఐదు దొంగతనాలకు పాల్పడ్డ గ్యాంగ్ ఐదో దొంగతనం వారి పాలిట శాపంగా మారింది. నిన్న రాత్రి 10 గంటలకు ఒంటరిగా ఉంటున్న వృద్ధురాలి ఇంటికి వెళ్లి ఇంటి కరెంట్ మెయిన్ ఆపి ఆమె మెడలో నుండి రెండు పేటల బంగారపు గొలుసు లాకెళ్లారు.
ఫోన్ ద్వారా పోలీసులకు స్థానికులుస మాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు అదే గ్రామంలో గాలింపు చర్యలు చేపట్టి ఐదుగురు గొలుసుల దొంగల్ని పట్టుకున్నారు. 1 గంట వ్యవధి లోనే చైన్ స్నాచర్స్ గ్యాంగ్ ని అరెస్ట్ చేసి, నందిగామ, జగ్గయ్యపేట, మధిర ప్రాంతాలలో దొంగతనాలకు పాల్పడ్డ చోరీ సొత్తు ను స్వాధీనం చేసుకున్నారు. వివిధ గోల్డ్ లోన్ బ్యాంకులలో తాకట్టు పెట్టిన మూడు గొలుసులతో సహా ఐదు బంగారపు చైన్లను స్వాధీనం చేసుకున్నారు.
అత్యంత తక్కువ సమయం లో చైన్ స్నాచర్స్ ని అరెస్ట్ చేసిన చిల్లకల్లు ఎస్సై చినబాబు ని సిబ్బంది ని ఏ సీ పి నాగేశ్వర రెడ్డి, జగ్గయ్యపేట సిఐ చంద్రశేఖర్ అభినందించి రివార్డులు అందజేశారు.