గత కొన్ని రోజులుగా బ్రిటన్‌లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా వడగాలులు వీస్తుండడంతో అప్రమత్తమైన బ్రిటన్ వాతావరణ విభాగం తొలిసారి ‘రెడ్ వార్నింగ్’ జారీ చేసింది. లండన్‌తోపాటు ఇంగ్లాండ్‌లోని పలు ప్రాంతాల్లో వచ్చే కొన్ని వారాలపాటు ఇదేరకమైన ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని పేర్కొంది. ఉష్ణోగ్రతలు అత్యధికంగా 40 డిగ్రీలకు చేరువవుతుండటంతో తొలిసారి జాతీయ ఎమర్జెన్సీ ప్రకటించారు.