ఏపీలో మద్యం షాపులను తిరిగి ప్రైవేటు వ్యాపారులకే అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు మూడు రోజుల కిందట జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో చర్చలు జరిగినట్లు అమలు సాధ్యాసాధ్యాలపై ప్రణాళిక సిద్ధమవుతున్నట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు. మరింత ఆదాయం రాబట్టుకోవటం కోసమే ప్రైవేటు వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.