శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి పెరుగుతోంది. ఎగువన ఉన్న జూరాల ప్రాజెక్టు నుంచి 1,046,47 లక్షల క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 1,01,586 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం శ్రీశైలం జలాశయానికి వచ్చి పడుతుంది. నీటిమట్టం శుక్రవారం ఉదయం 6 గంటలకు 835.60 అడుగులకు చేరగా, నీటి నిల్వ సామర్థ్యం 55.8766 టీఎంసీలుగా నమోదయ్యింది. జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 6,013 క్యూసెక్కులు దిగువకు వదిలారు.