వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు వద్దంటూ రైతులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన వ్యక్తం చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం కూడా రైతుల పంపుసెట్లకి మీటర్లు బిగించే విషయంలో వెనక్కి తగ్గింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు రైతు సోదరుల పంపుసెట్లకు విద్యుత్ మీటర్లు బిగిస్తున్నట్లు...?? అని మాజీ మంత్రి , టీడీపీ నాయకులూ ప్రత్తిపాటి పుల్లారావు ప్రశ్నించారు. అమ్మ వడి వేసాం , ఆటోలకి డబ్బులు ఇచ్చాము అని గొప్పలు చెప్పుకుంటూ, ఇప్పటినుండే ఓటర్లను డబ్బుతో కొనే ప్రయత్నాలు తప్ప, దేశానికీ వెన్నెముక అని చెప్పే రైతన్నలకు ప్రభుత్వం చేసింది ఏమిటి అని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెనక్కి తగ్గి రైతుల మీద భారం పడకుండా చూసుకోవలసిన అవసరం ఉందని తెలియజేసారు.