గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా సాగుతోంది. నెల్లూరు నగరంలో ఎమ్మెల్యే అనిల్‌కుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్, అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. తమ దృష్టికి వచ్చిన సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. తమ సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్న సీఎం వైయస్ జగన్ వెంటే తామంతా నడుస్తామని ప్రజాప్రతినిధులతో ప్రజలు చెప్పారు. మేనిఫెస్టోలో పేర్కొన్న అన్ని హామీలను తప్పకుండా నెరువేరుస్తున్నామని ప్రజాప్రతినిధులు ప్రజలకు చెప్పారు. సంక్షేమ పథకాలతో ప్రజలకి ఇంతలా తోడుగా ఉంటున్న మన జగన్ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో కూడా తోడుగా నిలవాల్సిన అవసరం ఉందని తెలియజేసారు.