తుగ్గలి: బూస్టర్ డోస్ ను ప్రతి ఒక్కరూ తప్పకుండా వేయించుకోవాలని ఏఎన్ఎం దానమ్మ తెలిపారు. శనివారం మండల కేంద్రమైన తుగ్గలిలోని సబ్ సెంటర్ లో ప్రజలకు బూస్టర్ డోస్ ను వేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరోనా మొదటి, రెండవ విడత వ్యాక్సిన్లు పూర్తయ్యి ఆరు నెలలు గడచి, 18 నుండి 59 సంవత్సరాలు కలిగిన ప్రతి ఒక్కరూ బూస్టర్ డోస్ ను వేయించుకోవాలని సూచించారు. ఇందులో ఆశా వర్కర్లు పాల్గొన్నారు.