ఎమ్మిగనూరు: ప్లాస్టిక్ వాడకాన్ని మానుకోవాలని ఎమ్మిగనూరు భాష్యం స్కూల్ ప్రిన్సిపాల్ కవిత కోరారు. శనివారం భాష్యం స్కూల్ అధ్వర్యంలో నో ప్లాస్టిక్ దినోత్సవాన్ని నిర్వహించారు.
స్కూల్ అవరణం నుండి పట్టణంలోని ప్రధాన వీధులలో విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ కవిత మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి కాలక్రమేణా పూర్తిగా మానుకోవాలని సూచించారు.