పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకను దేశం విడిచి వెళ్లినవారు ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. సంక్షోభం కారణంగా శ్రీలంకను వీడినవారు, గతంలో విదేశాల్లో స్థిరపడినవారు తమ దేశానికి డాలర్లు పంపడం ప్రారంభించారు.
డిపాజిట్ చేసిన స్లిప్‌ల చిత్రాలను ట్విటర్లో పంచుకుంటూ మిగతావారు కూడా స్వదేశానికి సాయం చేయాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే #SriLankaDollarChallenge ట్విటర్లో ట్రెండ్ అవుతుంది.