భద్రాచలం వద్ద వరద నీటి మట్టం కొంచెం తగ్గింది. ఒకదశలో 71.9 అడుగుల ఎత్తుగా నమోదైన నీటిమట్టం ఆదివారం ఉ. 6 గంటలకు 64.80 అడుగులకు తగ్గింది. మహారాష్ట్ర, ఛత్తీ్‌సగఢ్ నుంచి వరద తగ్గడంతో నిన్నటి నుంచే నీటిమట్టం తగ్గుతూ వచ్చింది.
నిన్నటి నుంచి ఆరు అడుగులు తగ్గిన గోదావరి నీటిమట్టం పూర్తిస్థాయిలో తగ్గాలంటే మరో రెండ్రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం భద్రాద్రి వద్ద 20,49,572 క్యూసెక్కుల నీరు వెళుతోంది.