మరో రెండు, మూడు నెలల్లో ఏపీలో మూడు రాజధానుల బిల్లు తీసుకొస్తామని మంత్రి గుడివాడ అమరనాథ్ స్పష్టం చేశారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా, అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లు పెట్టడం ఖాయమని చెప్పారు.
విశాఖలో శనివారం మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. పెట్టుబడిదారులు విశాఖ వైపే చూస్తున్నారన్నారు. ఆస్ట్రేలియా బృందం ఇటీవలే విశాఖలో పర్యటించిందన్నారు. నగరంలో ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటు చేస్తామన్నారు.