మనిషి అందం గురించి వివరించడం అంటూ జరిగితే అది ముఖం దగ్గర నుండి మొదలవుతుంది , అందులో ప్రముఖమైనవి ఎదుటివారిని ఆకర్షించేవి రెండు . ఒకటి కళ్ళు , రెండవది పెదవులు అవునా కాదా ...? మరి ఇంత ప్రాముఖ్యత ఉన్న వీటికి ఏమైనా జరిగితే వామ్మో ఇంకేమైనా ఉందా . ఊహించడానికే భయం వేస్తుంది కదా .. . కానీ మనం ఎంత జాగర్త తీసుకున్న కానీ వాతావరణ మార్పుల వలన కొన్ని సార్లు సమస్యలు తప్పవు .
చలి కాలంలో పెదవులు ఎండిపోవడం , పగలడం లాంటివి జరుగుతూనే ఉంటాయి . వీటిని అధికమించడానికి ఎక్కువ శ్రమ పడవలసిన పని లేదు . అసలు సమస్య రావడానికి కారణం ఏమిటో తెలిస్తే పరిష్కారం సులభం అవుతుంది అది ఏ విషయంలో ఐనా సరే.
వాతావరణం చల్లగా ఉండటం వలన మనం అధికంగా నీరు తాగడం మానేస్తాం అది మంచి పద్దతి కాదు, ఏ కాలంలో ఐనా మనిషి సగటున ఐదు లీటర్ల నీళ్లు తాగాలి అనేది గుర్తుపెట్టుకోవాలి . దీని వలన చర్మం తో పాటుగా జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటుంది . అలానే వాతావరణంలో పొడి గాలులు వీస్తూ ఉంటాయి వీటి వలన కూడా తేమ తక్కువ అయ్యి పగుళ్ల సమస్య రావడం జరుగుతుంది .
ఇలాంటి సమయంలో మీరు వెన్న వాడటం అనేది చాల మంచిది . రాత్రి వేళలో మీ పెదాలకు వెన్న రాసి ఉదయం స్నానం చేసే వరకు ఉంచుకోండి . ఇలా మీరు వారానికి మూడు రోజులు చెయ్యడం వలన మీ పెదాలు చాల మృదువుగా అందంగా కనపడతాయి అలానే మీరు ఈ పగుళ్ల సమస్య నుండి బయటపడతారు .
అలానే మార్కెట్ లో చాల రకాల లిప్ బామ్స్ అందుబాటులో ఉన్నాయ్ . మీరు ఇవి వాడిన కూడా మీకు ఫలితం దక్కుతుంది . పెదవులు పగలడం వల్ల చాలా చికాకు పడుతుంటారు. ఇలాంటి వారు గ్రీన్ టీ బ్యాగ్స్ ను ఉపయోగించవచ్చు. గ్రీన్ టీ బ్యాగులను గోరువెచ్చని నీటిలో వేసి పెదవులపై పెట్టుకొని కొన్ని నిమిషాలు అలానే ఉంచండి. ఇలా చేయడం వల్ల పగిలిన పెదవులు నునుపుగా తయారవుతాయి.