సాధారణంగా ఎక్కువ మందికి వారి మెడ వెనుక భాగం నల్లగా ఉండటం గమనించవచ్చు ఇది ఆడ , మగ అనే తేడా లేకుండా అందరిలో ఉంటుంది . మనిషి మొత్తం అంత కలర్ ఉన్న ఇక్కడ మాత్రం నల్లగా ఉండటం అనేది కొంత మందిలో గమనించవచ్చు . ఐతే ఇలా రావడానికి అనేకరకమైన కారణాలు ఉన్నాయి . భారీ ఖాయం , కొవ్వు ఎక్కువగా అక్కడ చేరుకోవడం , చర్మ వ్యాధులు సమస్య , మధుమేహం , థైరాయిడ్ వంటి వాటి వాళ్ళ కూడా ఇలా నల్లగా తయారవుతుంది . వీటిని తగిన వైద్యుడిని కలిసి అతని సలహాలు మేరకు మందులు వాడుకోవడం మంచిది .
మెడ వెనక భాగంలో చర్మం కమిలిపోయినట్లు ఉంటే- బరువైన ఆభరణాలు ధరించకూడదు. దీని వల్ల సమస్య మరింతగా పెరుగుతుంది. ఎక్కువ సార్లు రుద్దటం వల్ల మచ్చలు పోతాయనుకోవటం పొరపాటు. మచ్చలు ఉన్నవారు చర్మవ్యాధి నిపుణులను సంప్రదించి మందులు వాడాలి. బరువు తగ్గటం వల్ల కూడా కొన్ని సార్లు మచ్చలు పోతాయి. అందువల్ల మెడ మీద మచ్చలు ఉన్నవారు ముందుగా బరువు తగ్గితే మంచిది.
కానీ ఈ సమస్యల వలన కొంత మందిలో మాత్రమే ఈ ప్రాబ్లెమ్ వస్తుంది ఎక్కువ మందిలో సరిగ్గా శుభ్రం చెయ్యకపోవడం వలన వస్తుంది . మెడ నల్లగా మారినప్పుడు ఈ సమస్యను సులభంగా అధికమించే విషయాలు తెలుసుకుందాం . దీనికి కావలసినవి నిమ్మకాయ , సాల్ట్ , టూత్ పేస్ట్ . వీటితోనా .....? అని మీకు సందేహం కలగవచ్చు కానీ వీటి వలన చాల ప్రయోజనం ఉంది . మొదటగా నిమ్మకాయని కోసి మీ మెడ భాగాన బాగా రుద్దండి తర్వాత దానిపై సాల్ట్ కొంచెం మరియు టూత్ పేస్ట్ కొంచెం వేసి మల్లి రుద్దండి .తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి . ఇలా మీరు వారానికి మూడు సార్లు చొప్పున చెయ్యడం వలన , నల్లగా ఉన్న మీ మెడ భాగం మల్లి మీ శరీర రంగులోకి మారుతుంది .