ముఖంపై మచ్చలు సాధారణంగా వస్తూ ఉంటాయి ఇవి రావడానికి అనేక కారణాలు ఉన్న కానీ వచ్చాక చూడటానికి మాత్రం బాగుండదు . దీని వలన సమాజంలో చాల సిగ్గుగా ఉన్నట్టు , ఏదైనా నలుగురిలో మాట్లాడాలి అంటే కొంత ఆత్మ స్టెర్యం కోల్పోవడం , స్నేహితులతో కలిసి ఎక్కువ సమయం ఆనందంగా గడపలేకపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి .
అసలు ఈ రకమైన మచ్చలు రావడానికి కారణం ఏమిటి అంటే , శరీరంలో మెలనిన్ ఉత్పత్తి ఎక్కువగా ఉన్నప్పుడు చర్మం మీద ఎక్కడైనా ఈ సమస్య రావొచ్చని అంటున్నారు వైద్యులు. హార్మోన్ల సమతుల్యత సరిగ్గా లేకపోవడం , వయసు పైబడినప్పుడు, చర్మం ముదిరిపోవడం వలన కూడా ముఖంపై మచ్చలు వస్తాయి.
ఇలాంటి వాటిని తగ్గించడానికి మెడికల్ షాపులలో చాల రకాల ఉత్పత్తులు ఉన్నాయి . కానీ ఇవి మన చర్మానికి కొన్నిసార్లు గిట్టవు దానివలన వేరే చర్మ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం లేక పోలేదు కాబట్టి వీటిని వాడే ముందు సంబంధిత వైద్యుడిని సంప్రదించి వారి సలహా మేరకు వాడటం ఉత్తమమైనది .
ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా , తక్కువ ఖర్చుతో మంచి ఫలితాన్ని పొందే చిట్కాలు ఇప్పుడు తెలుసుకుందాం .
మునగాకుల రసం, తేయాకు రసం. ఈ రెంటి మిశ్రమంతో పిగ్మెంటేషన్ సమస్యను అరికట్టవచ్చు. ఉదయాన్నే నిద్రలేచాక కొద్దిగా మునగాకు రసం, కొద్దిగా తేయాకు రసం బాగా కలిపి ముఖానికి పూయాలి. ఓ గంట తర్వాత మంచి నీటితో ముఖాన్ని శుభ్రపరచుకోవాలి. ఇలా ప్రతిరోజూ చేస్తే నల్లటి మచ్చలు మాయమవుతాయి.
ఎందుకంటే , మునగాకు లో విటమిన్ సి ఉంటుంది అలానే తేయాకు రసంలో నల్లటి మచ్చలను తొలగించే సామర్ధ్యం ఉంటుంది .
ముఖం మీద మచ్చలు ఏర్పడటాన్ని పిగ్మెంటేషన్ అంటారు . ఇది అధికంగా ఉన్న వారు అలోవెరా ( కలబంద ) వాడటం మంచిది. కలబంధకి సంబంధించి మార్కెట్ లో కలబంద జెల్ అందుబాటులో ఉంది అలానే ,కలబంద సబ్బులు కూడా ఉన్నాయి . వీటిని వాడటం వలన మంచి ఫలితం పొందవచ్చు .
లేదా , కలబంద మీకు అందుబాటులో ఉంటె , కలబంద గుజ్జుని తీసుకొని మెత్తగా పేస్ట్ లాగ చేసినప్పుడు అది ఒక పొర లాగ నురగ కలిగి ఉంటుంది. దానిని మీ ముఖం మీద ప్యాక్ ల వేసుకొని ఒక అరగంట పాటు ఉంచండి . తర్వాత శుభ్రమైన నీటితో కడగండి . దీని ద్వారా మచ్చలు తగ్గడమే కాక మీ చర్మం చాల కాంతివంతంగా , ఆరోగ్యంగా కూడా ఉంటుంది . దూదితో ప్రతిరోజూ రెండుసార్లు ముఖానికి పాలను పట్టించడం వలన ముఖం తాజాగా కనిపిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa