ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రామ్ గోపాల్ వర్మపై కోర్టుకెక్కిన బీజేపీ కార్యకర్త

national |  Suryaa Desk  | Published : Sun, Jul 17, 2022, 10:42 PM

నోటీ దురుసుతనం దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు చేటు తెచ్చేలావుంది. ఇటీవల ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముపై ఆయన చేసిన వ్యాఖ్యలు విమర్శల పాలవడం తెలిసిందే. ద్రౌపది సరే... పాండవులు ఎవరు? కౌరవులు ఎవరు? అంటూ వర్మ ట్వీట్లు చేశాడు. ఇదిలావుంటే ఈ ట్వీట్లపై సుభాష్ రాజోరే అనే బీజేపీ కార్యకర్త ముంబయి కోర్టును ఆశ్రయించాడు. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముపై వర్మ తప్పుడు వ్యాఖ్యలు చేశారని సుభాష్ రాజోరే కోర్టుకు తెలిపాడు. మహిళల గౌరవానికి భంగం కలిగించేలా తన ట్విట్టర్ ఖాతా ద్వారా సోషల్ మీడియాలో అవమానకర వ్యాఖ్యలు చేశారని వివరించాడు. వర్మ ట్వీట్లు షెడ్యూల్డ్ కులాల ప్రజలను అగౌరవపరిచేలా ఉన్నాయని పేర్కొన్నారు. వర్మపై తగిన చర్యలు తీసుకోవాలని కోర్టును కోరాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com