మనిషి రంగు ఎలా ఉన్న, దంతాల విషయంలో మాత్రం అందరూ తెల్లగా అందంగా ఉండాలి అని అనుకుంటారు . కానీ దంతాలు బలంగా ఉన్నాయ్ అని అనడానికి తెల్లగా ఉంటె ఉన్నట్టు కాదు , కొంత లేత గోధుమ రంగు వర్ణాన్ని కలిగి ఉండాలి అని కొంత మంది నిపుణులు చెప్తున్నారు . ఎవరు చెప్పిన కానీ జనాలకు మాత్రం తెల్లగా ఉండాలి అని ఆశ పడుతుంటారు , వాస్తవానికి చూడటానికి తెల్లగా ఉన్న దంతాలు చాల అందంగా ఉండటమే దీనికి కారణం .
దంతాల అందం విషయంలో మనం ఎంత జాగర్త తీసుకుంటామో అలానే వాటి ఆరోగ్య విషయంలో కూడా జాగర్తలు తప్పని సరి . లేకుంటే పుచ్చిపోవడం , ఊడిపోవడం , గట్టిగ ఉన్న ఆహారాన్ని తీసుకో లేకపోవడం , చల్లటి నీళ్లు తాగుతున్నప్పుడు ఇబ్బందిగా ఉండటం లాంటి సమస్యలు వస్తుంటాయి .
దంతాలు తళతళా మెరిసిపోతూ, ఆరోగ్యంగా ఉండటానికి మనం చాల రకాల టూత్‌పేస్ట్ వాడుతూ ఉంటాము కానీ దానితో పాటు మనం తీసుకొనే ఆహరం విషయంలో కూడా కొన్ని జాగర్తలు తీసుకోవలసి ఉంది అని నిపుణులు చెప్తున్నారు.
విటమిన్ సి ఎక్కువగా ఉండే నిమ్మజాతి పండ్లు రక్తనాళాలను బలంగా చేసి చిగుళ్లు, దంతాల దృఢత్వాన్ని పెంచుతాయి.నిమ్మజాతి పండ్లను ఎక్కువగా ఆహారంలో భాగంగా తీసుకోవాలి. కెరోటిన్ అనే ఒక పొర దంతాలపై ఉండటం , మనం చేసే కొన్ని తప్పిదాల వలన ఆ పొర దెబ్బతిని చల్లటి నీరు తాగినప్పుడు జివ్వుమని లాగడం , దంతాలు తిమ్మిరి గురి కావడం లాంటివి జరుగుతుంటాయి .
దంతాలు అసలు బలంగా , దృఢంగా ఉండటానికి కారణం వీటిలో కాల్షియం అధికంగా ఉండటం . కాబట్టి ఇవి ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలి అంటే కాల్షియం అధికంగా ఉన్న ఆహరం తీసుకోవడం తప్పనిసరి . పాలల్లో అధిక మొత్తంలో క్యాల్షియం ఉండటం వల్ల కేవలం ఎముకలే కాదు.. దంతాలు కూడా దృఢంగా తయారవుతాయి.
మనం ఆహరం తీసుకున్న తర్వాత దంతాలను శుభ్రం చేసుకోవాలి , లేకుంటే దంతాల మధ్య మనం తీసుకున్న ఆహరం ఇరుక్కుపోయి అక్కడ బాక్టీరయ చేరి నోరు దుర్వాసన వచ్చేలా చేస్తోంది అలానే నోటి లోని లాలాజల స్థాయిని తాగించడానికి అవకాశం కలదు .
నీరు కూడా సాధ్యమైనంత ఎక్కువ తాగడం ఆరోగ్యానికే కాదు దంతాలకు కూడా మేలు చేస్తుంది. నీటిలోని మినరల్స్ దంతాలను ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి .
పెరుగు , పాలు, నట్స్, గుడ్లు, మాంసం.. లాంటి న్యూట్రియంట్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం దంతాల ఆరోగ్యానికి చాలా ముఖ్యం. వీటితో పాటు తాజా పండ్లు, కూరగాయలను కూడా ఆహారంలో భాగం చేసుకోవాలి. వీటిలో అధికంగా కాల్షియం ఉండటం వలన దంతాలు బలంగా తయారవుతాయి .
చేపలు ఎక్కువగా తినడం వల్ల కూడా దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఇది దంతాలకు ఎలాంటి వ్యాధులు సోకకుండా రక్షణనిస్తుంది.
అప్పుడప్పుడు షుగర్ ఫ్రీ గమ్స్ నమలడం కూడా దంతాల ఆరోగ్యానికి మంచిదే. ఎందుకంటే వీటిని నమలడం వల్ల పంటికి మంచి ఎక్సర్‌సైజ్‌తో పాటు పళ్ల చుట్టూ ఏదైనా బ్యాక్టీరియా ఉన్నా కూడా తొలగించి దంతాల ఎనామిల్‌ను యాసిడ్స్ నుంచి కాపాడతాయి.
సల్ఫేర్ , పాస్పోరాస్ , కాల్షియం ఎక్కువగా ఎటువంటి ఆహారంలో దొరుకుతాయో చూసుకొని వాటికి ప్రాముఖ్యత ఇవ్వడం మంచిది అలానే , వేప , ఉప్పు లాంటివి కూడా దంతాలు బలంగా తయారవ్వడానికి దోహదపడతాయి . అందుకే ఈ మధ్య టీత్ పేస్ట్ లలో కూడా వీటిని కలపడం అనేది గమనించవచ్చు .