పెరుగుతున్న టెక్నాలజీ మనిషి జీవితంలో చాల బిజీ లైఫ్ గడిపేలా చేస్తుంది . దేని వల్ల కొంత మంది జీవితాలలో ఆర్థికంగా మెరుగైనప్పటికీ , సంసార విషయంలో కొంత వెనకపాటు కలిగివుండటం అనేది ఇప్పుడు సమాజంలో ఎక్కువగా ఉంది . పూర్వం మనుషులు ఎక్కువ సంసార జీవితానికే ప్రాధాన్యత ఇచ్చేవారు అందుకే వారు ఎక్కువ పిల్లలని కనే వారు . కానీ ఎప్పుడు సమాజంలో సంసారం మీద కొంత అవగాహన లోపం వలన కానీ , ఆసక్తి తక్కువ వల్ల కానీ , అన్ని ఉన్న గడపడానికి సమయం లేకపోవడం వలన కానీ ఈ విషయం లో ఎక్కువగా శ్రద్ధ చూపలేకపోతున్నారు . స్త్రీ విషయంలో కానీ పురుషుని విషయంలో కానీ కొంత అనాశక్తి చూపటం వలన ఎదుటి వారిలో కొత్త భాధ అనేది ఏర్పడుతుంది .
దీని వలన ఇద్దరి మధ్య కొన్ని అసమానతలు , అనుమానాలు కలగడం , ద్వేషపూరితంగా మాట్లాడటం లాంటివి జరుగుతాయి , ఇవే పెరిగి పెద్దవై మీ సంసారంలో ఇబ్బందులకు దారి తీస్తుంటాయి . పెళ్లైన కొత్తలో ఇద్దరికి కొత్తగా జీవితం ప్రారంభించడం కాబట్టి ఎవరికి ఎవరి గురించి పూర్తిగా అవగాహన ఉండదు . కాబట్టి ఎదుట మనిషిని గమనించడం మంచిది . ఇద్దరు సమానం కాబట్టి ఎవరు ఎవరిపైన అధమాషి చెయ్యకూడదు . నేను చెప్పిందే జరగాలి అనే నియంత భావన పక్కన పెట్టి ఎదుట వారు కూడా ఏమి చెపుతున్నారు అది కరెక్ట్ నా లేక మనం చెప్పేది కరెక్ట్ నా అని ఆలోచించాలి , ఎవరి ఆలోచన వల్ల మనకు మేలు జరుగుతుంది అనేది గ్రహించాలి . ఒకవేళ మన భాగస్వామి చెప్పేది సరిఐనది కాకపోతే వారికీ సున్నితంగా దాని వలన కలిగే నష్టాలను తెలియచేయాలి. అది ఆడ ఐనా మగ ఐనా ఇద్దరు సమానమే అనే భావన ప్రతి ఒక్కరిలో అలవరచుకోవాలి . నేను మగవాడిని కాబట్టి నేను గొప్ప లేదా నేను చెప్పిందే అందరూ వినాలి ,చెయ్యాలి అనే మూర్ఖపు ధోరణి మగవారు తీసివేయాలి. ఆడవారు కూడా మగవారికి ఏ విషయంలో తీసిపోరు అని గుర్చించాలి . ఎందుకంటే ఆడవారు తక్కువ ఐతే ఇందిరా గాంధీ దేశ ప్రధాని అవుతుంతా,మదర్ థెరిస్సా ప్రపంచం మొత్తం కీర్తించబడుతుందా , ఝన్సీ లక్షిమిభాయ్ వీటి పోరాటం చెయ్యగలుగుతుందా ...? కాబట్టి మగ వారు ఆలోచనతో ఇద్దరు సమానమే అని గుర్తించాలి .దీని వలన చాల సమస్యలు తగ్గుతాయి .
అలాగే ఒకరికి ఇష్టం లేని పనులు ఇంకొకరు చెయ్యడం , ఇష్టం లేని అలవాట్లకు బానిసలూ కావడం లాంటివి తగ్గించుకుంటే మంచిది.
అన్నిటికన్నా ముఖ్యమైనది సంసార విషయం . ఈ విషయంలో భాగస్వామికి ఇబ్బంది కలిగేలా ప్రవర్తించకుండా ఎదుటి వారి మనసుని కష్టపెట్టకుండా వారి మనసు తెలుసుకొని మీరు రతిలో పాల్గొనడం చెయ్యాలి . దీని వలన ఒకరి మీద ఇంకొకరికి ప్రేమ అధికం అవుతుంది , ఆ ప్రేమే మీ దాంపత్య జీవితానికిసుఖాన్ని ఇస్తుంది .