ప్రతి ఆడ పిల్ల విషయం లో ఋతుచక్రం సహజం మొదటిసారి వచ్చే దానిని రజస్వల అవ్వడం అంటారు , పల్లె ప్రాంతాలలో పెద్ద మనిషి అవ్వడం అంటారు . ఎవరు ఎలా పిలిచినా దాని అర్థం మాత్రం ఒక్కటే . మొదటి సారి ఋతుచక్రం వచ్చిన వారిలో కొత్తగా ఉండటం వలన కొంత ఆందోళన కి గురి అవుతుంటారు . కానీ ఇది స్త్రీ జీవన శైలిలో ఒక భాగం . చాల సహజమైనది అని తల్లి పిల్లలకు వివరించాలి ,అప్పుడు వారిలో భయం పోయి నిబ్బరం తో ఉంటారు అలాగే ఇది ప్రతి నెల వస్తుంది అని ఇది వచ్చినప్పుడు శరీరం లో జరిగే మార్పులు మరియు పరిస్తుతులను క్షుణ్ణం గ వివరించాలి .ఈ విషయాలు చెప్పేటప్పుడు చిన్నగా ,రహస్యం గా మాట్లాడం లాంటి పనులు సెయ్యకూడదు . ఎందుకనగా ఇలా సెప్పడం వల్ల ఇది ఏదో తప్పు ఏమో అన్న భావన వీరిలో కలుగుతుంధి కాబట్టి మీరు సహజం గా సెప్పడానికి ప్రయత్నించండి . అలాగే ప్రతి నెల వచ్చినప్పుడు జరిగే కొన్ని విషయాలు కూడా తెలియజేయండి .
. రక్త స్రావం
. తిమ్మురులు
. కడుపులో నొప్పి
. నీరసం
. వళ్ళు నొప్పులు ,తల నొప్పి .
ప్రధముగా వీటి గురించి మంచి అవగాహనా కలిగించాలి ,ఇవి ఏప్పుడు వస్తాయి ,వీటి వలన శరీరం లో జరిగే మార్పులు గురించి పూర్తిగా అవగాహనా కలిగించాలి . అప్పుడు మీ పిల్లలు ఏటువంటి వత్తిడి కి గురి కాకుండా ఉంటారు . ఎందుకనగా మొదటి సారి వచ్చే వారికీ కొంత భయం సహజం గ ఉంటుంది కాబట్టి .
అలాగే ,పిల్లలకు ఆ సమయం లో కొంచెం తోడుగా ఉండాలి . ఎందుకనగా ఆ సమయం లో వీళ్ళలో కొంత ఆలోచన భావం మారుతుంది కాబట్టి . కొన్ని నెలలు గడచినా తర్వాత వాళ్ళకి కూడా పూర్తిగా దీని గురించి ఒక అవగాహనా వస్తుంది ,ఆ సమయం వచ్చే వరకు తల్లి ,పిల్లలకు దేర్యం చెపుతూ ఉండాలి .
ముఖ్యం గా ఈ సమయం లో వీరికి మంచి పోషక విలువలు కలిగిన ఆహరం అందించాలి ,అలాగే ఆ సమయం లో వీరిని అవి తాకకూడదు ,ఇవి తాకకూడదు అని నిబంధనలు పెట్టకూడదు . ఎందుకనగా ఇలాంటి మాటలు వలన పిల్లల్లో అదో అసంతృప్తి మరియు ఒంటరి తనానికి గురి అవుతారు కాబట్టి మూఢ నమ్మకాలు నమ్మి అలాంటి వి చెయ్యకూడదు . ఇది ప్రతి స్రి జీవన శైలిలో ఒక భాగం గానే గుర్తుంచుకోవాలి . అలాగే రక్తస్రావం జరిగే టప్పుడు ఎటువంటి ఆందోళన కి గురి కావద్దు ,ఇది ప్రతి వారిలో జరుగుతుంది అని దేర్యం చెప్పాలి .
ఇక పోతే , ఆ సమయం లో ఉపయోగించే "నాప్కిన్స్" గురించి వారికీ క్షుణ్ణంగా తెలియచెయ్యాలి . అవి ఎలా వాడాలి అన్న పద్దతి ప్రేమగా తెలియజేయాలి . పిల్లలు స్కూల్ కి వెళ్ళినప్పుడు కానీ ఇతర ప్రదేశాలకు వెళ్ళినప్పుడు కానీ వీరు ఎటువంటి వత్తిడి కి గురి కావద్దు అని చెప్పాలి . విడి రోజులలో ఎలా ఉంటారో అలానే ఉండాలి ,ఎటువంటి భయానికి వత్తిడికి గురి కాకుండా ఎక్కువ ఆలోచన చెయ్యకుండా ప్రశాంతం గా ఉండాలి అని తెలియజేయాలి . ఇలా కొన్ని నెలలు వీరికి ఈ ఋతుచక్రం మీద అవగాహనా వచ్చే వరకు తల్లి ఇలాంటి జాగర్తలు తీసుకోవాలి