భార్య , భర్తల విషయం లో , ముఖ్యంగా వారి సంసారం జీవితం లో చాలా అపోహలు అనుమానాలు ఉండటం సహజం . వీటికి అనేక రకమైన కారణాలు ఉంటాయి . ఆర్ధిక మరియు కుటుంబ విషయాలతో సతమతం అవుతూ లైంగిక విషయంలో కొంత వెనక పాటు ఉంటుంది , అందులో కూడా మన భారతీయులలో అధికం . కొంత మంది పని వత్తిడి వలన మరియు మానసిక ఒత్తిడి వలన కూడా పెద్దగా శ్రద్ధ చూపకపోవడం ఎక్కువ గా జరుగుతుంది .
మగ వారు లైంగిక విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు ,అలంటి ఫీలింగ్స్ నార్మల్ గా మగ వారి కన్నా ఎక్కువ ఆడవారిలో ఉంటుంది కానీ సిగ్గు బిడియం వలన వారు బయటికి వ్యక్తపరచరు. మనిషి జీవితంలో ప్రతి విషయానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో ఈ విషయం లో ఇంకా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి . కానీ కొంత మందికి కొన్ని వ్యసనాలు ఉంటాయి ఇంధులో మగవారు ఎక్కువగా ధూమపానం , మద్యపానం లాంటి అలవాట్లు ఉండటం జరుగుతుంది . ఈ అలవాట్లు వలన లైంగిక విషయంలో కొన్ని సమస్యలు వస్తుంటాయి . మరి ముఖ్యంగా మద్యపానం విషయంలో ఎక్కువగా వస్తుంటాయి , వీటి వలన వారి జీవితాలు నాశనం చేసుకోవడం కూడా జరుగుతుంది . దానికి కారణం మీ పార్టనర్ కి ఆ వాసన పడకపోవడం లేక మీ పద్దతి నచ్చకపోవడం లాంటివి .
కానీ కొంత మంది లైంగిక చర్యలో పాల్గొనడానికి మరియు ఎక్కువగా ఆస్వాదించాలనే కోరికతో మద్యం శెవించడం చేస్తుంటారు . మద్యం వలన మన శరీరంలో కొన్ని నరాలు పనిచేయకపోవడం లేదా ఎక్కువగా ఉద్రకాపడటం లాంటివి జరుగుతాయి . వాస్తవానికి మద్యం తాగి సెక్స్ లో పాల్గొనే వారికి ఆ సమయంలో ఎక్కువగా తృప్తి పడతారు కానీ అది తాత్కాలికం . దీని ఫలితం ముందు ముందు జీవితంలో పడుతుంది కాబట్టి మద్యం తీసుకోవడం మంచిది కాదు , సహజ పద్దతిలోనే ఈ పని చేయ్యడం మంచిది అలాగే టాబ్లెట్స్ లాంటివి కూడా వాడటం మంచిది కాదు కాబట్టి మనసు కొంచెం ప్రశాంతంగా ఉంచుకొని మెంటల్గా సిద్ధం ఐ ఈ పని చెయ్యడం వలన మీరు మంచి అనుభూతిని పొందుతారు .