ఏపీలో మంగళవారం స్కూళ్ల బంద్ కు ఏబీవీపీ పిలుపునిచ్చింది. కార్పొరేట్ స్కూళ్లలో ఫీజుల దోపిడీని నిరసిస్తూ బంద్ కు పిలుపునిచ్చింది. ఆదివారం విజయవాడలో ఏబీవీపీ జాతీయ కార్యదర్శి నాగోతు హరికృష్ణ మీడియాతో మాట్లాడారు. పుస్తకాలు, యూనిఫామ్ పేరుతో నిలువుదోపిడీ చేస్తున్నారని విమర్శించారు. ఉన్నతాధికారులు డీఎఫ్ఆర్సీ కమిటీ రూల్స్ అమలు చేయాలని, రూల్స్ కి విరుద్ధంగా నడుస్తున్న స్కూళ్లపై చర్యలు తీసుకోవాలన్నారు.