ఈ విద్యా సంవత్సరం లో తొలి ప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం ఉదయం కావలి రూరల్ మండలం సిరిపురం వద్ద కావలి పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాల బస్సు బోల్తా కొట్టింది. అధికారుల నిర్లక్ష్యంతో ఫిట్ నెస్ లేని బస్సులు యదేచ్చగా తిరుగుతున్నాయి. గుంతల రహదారులలో అర్హతలేని డ్రైవర్ లతో బస్సు నడపడంతో ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు అద్దాలు పగిలినప్పటికీ అదృష్టం కొద్దీ పిల్లలెవరికీ పెద్ద ప్రమాదం లేకుండా పోయింది.