సోమశిల జలాశయంకు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. ప్రస్తుతం 55. 887 టిఎంసిల నీటి మట్టం నమోదయింది. ఈ మేరకు సోమవారం ఉదయం సోమశిల జలాశయం అధికారులు తాజా ప్రకటన విడుదల చేశారు. సోమశిల జలాశయంకు ఎగువ ప్రాంతాలనుంచి 1236 క్యూసెక్కుల నీటి ప్రవాహం వస్తోంది. సోమశిల జలాశయం నుంచి కండలేరు కు 150 క్యూసెకులు, ఉత్తర కాలువకు 3 క్యూసెక్కులు పెన్నా డెల్టాకు 310 కావలి కెనాల్ కు 550 క్యూసెక్కుల నీటి ప్రవాహాన్ని విడుదల చేస్తున్నారు.