అనంతపురం జిల్లా, ఇటుకలపల్లి పోలీసు స్టేషన్ పరిధిలోని కందుకూరు గ్రామంలో పోలీసులు ఈరోజు కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఎస్సై శ్రీకాంత్ ఆధ్వర్యంలో సిబ్బంది పాత కేసుల్లోని నిందితులు, అనుమానితుల ఇళ్లల్లో తనిఖీలు చేపట్టారు. అనంతరం... గ్రామసభ నిర్వహించి నేరాల జోలికెళ్లకుండా సత్ప్రవర్తనతో జీవించాలని... పాత పంథాకు వెళితే చట్టం గట్టిగా పని చేస్తుందని హెచ్చరించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల జోలికెళ్లరాదని,సి.సీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని మరియు దిశ యాప్ పై అవగాహన చేశారు.