సూక్ష్మసేద్యంలో ఏపీ అగ్రగామిగా నిలవడం వైసీపీ పార్టీ ప్రభుత్వ గొప్పతనంగా సాక్షిలో హెడ్ లైన్ లో రాసుకోవడం హాస్యాస్పదం అని టీడీపీ నాయకులూ సోమిరెడ్డి చంద్రశేఖర రెడ్డి ఎద్దేవా చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జగన్ ఎన్ని గొప్పలు చెప్పుకునే యత్నం చేసినా ఆ క్రెడిట్ చంద్రబాబు కే దక్కుతుంది. ఆయన హయాంలో కేటాయించిన నిధులు,ఇచ్చిన ప్రోత్సాహకాలతోనే ఈరోజు అగ్రస్థానం సాధ్యమైంది. వైసీపీ మూడేళ్ల పాలనలో మైక్రో ఇరిగేషన్‌ను పూర్తిగా మూలపెట్టేశారు. ఒక్క రూపాయి కేటాయించిన పాపాన పోలేదు.. లేదంటే సాగువిస్తీర్ణం ఇంకా పెరిగేది. 2002లో కుప్పంలో ఇజ్రాయిల్ టెక్నాలజీ మైక్రో ఇరిగేషన్‌ను ప్రారంభించడం ద్వారా దేశానికి ఈ తరహా సేద్యాన్ని పరిచయం చేసిందే చంద్రబాబు . నవ్యాంధ్రకు చంద్రబాబు సీఎం అయ్యాక ఈ రంగాన్ని మరింత ప్రోత్సహించారు. ఏడాదికి 1200 కోట్లు వరకు ఖర్చుపెట్టి 2017-18లో మైక్రో ఇరిగేషన్‌లో ఏపీని జాతీయ స్థాయిలో అగ్రస్థానంలో నిలిపారు.ఆయన ముందు చూపు, పట్టుదలతోనే ఈ రోజు 51% సాగువిస్తీర్ణంతో మరోసారి ఏపీ దేశంలో ముందు నిలిచింది